నేరేడు చర్ల తహసిల్దార్ కార్యాలయంలో ప్రవైట్ వ్యక్తుల రాజ్యం! ప్రజా సేవలు బందీగా మారిన రెవెన్యూ వ్యవస్థ –గతంలో కూడా డి.ఆర్. బుక్ మిస్ అయినా చలనం లేని అధికారులు

డైనమిక్ ,నేరేడు చర్ల,నవంబర్7 నేరేడు చర్ల మండల తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం అధికారుల కన్నా ప్రవైట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రజల్లో ముదురుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయం ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల అజెండాకి వేదికగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రవైట్ సిబ్బంది ఆధిపత్యం – అధికారుల నిర్లక్ష్యం! తహసిల్దార్ ఆఫీస్‌కు వచ్చిన ప్రజలు మొదటగా “ప్రవైట్ వ్యక్తి”ని కలవకపోతే ఫైల్ కదలదన్న వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం సంతకం పెట్టేంత పని మాత్రమే చేస్తున్నారని ప్రజల వాంగ్మూలం. ఫైళ్లు తయారు చేయడం నుంచి ప్రింటింగ్ వరకూ అంతా ప్రైవేట్ సిబ్బందే నిర్వహిస్తున్నారు. గతంలో కూడా డి.ఆర్....