నేడు వందేమాతరం జాతీయ గీత సామూహిక ఆలాపనకు సిద్ధమైన నల్గొండ జిల్లా

డైనమిక్,నల్గొండ బ్యూరో, నవంబర్ 7 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేడు శుక్రవారం నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందేమాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠి తెలిపారు. బంకించంద్ర చటర్జీ రచనకు 150 సంవత్సరాలు బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలు, కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు గీతాలాపన జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నవంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఒకే సమయంలో వందేమాతరం...