సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా విద్యార్థినులకు అవగాహన సదస్సు నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్6 నల్లగొండ పట్టణంలోని దీప్తి నర్సింగ్ కళాశాలలో గురువారం సైబర్ జాగరుకత దివస్ సందర్భంగా విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పోలీస్ అధికారి శరత్ చంద్ర పవార్, ప్రజలందరూ సైబర్ మోసాల నుండి రక్షించుకునేందుకు తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఎస్పీ మాట్లాడుతూ, "ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేలాది మంది సైబర్ మోసాలకు గురవుతున్నారు. డబ్బులు పోయిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం" అన్నారు.కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి...