గురుకుల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన అవసరం జిల్లా ఎస్పీ నరసింహా

డైనమిక్,సూర్యాపేట బ్యూరో,నవంబర్6 సూర్యాపేట రూరల్ పరిధిలోని బాలెంల గ్రామ శివారులో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా సైబర్ మోసాలు, సోషల్ మీడియా ప్రభావం, లక్ష్యాలు–విజయాలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే విజయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలకు పునాది వేయాలని, వ్యక్తిగత క్రమశిక్షణతో జీవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతర కృషి, సాధన అవసరమని చెప్పారు. విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండి...