తుఫాన్ ప్రభావంతో 150 ఎకరాల పంట నీటమునిగింది మండల వ్యవసాయ అధికారి వెంకటేష్‌ పరిశీలన

డైనమిక్,పాలకవిడు నవంబర్‌ 6 మండలంలోని గుండ్లపాడు, నర్లెంగలగూడెం, గుండెబోయినగూడెం గ్రామాల్లో ఇటీవల సంభవించిన ముంతా తుఫాన్‌ కారణంగా పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్‌ గురువారం ప్రభావిత గ్రామాలను సందర్శించి పంట నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామస్థులు తమ పొలాలను చూపిస్తూ తుఫాన్‌ వల్ల పంటలు పూర్తిగా నీట మునిగిపోయినట్లు అధికారికి వివరించారు. సుమారు 150 ఎకరాల వరి, మక్కజొన్న, కంది పంటలు నీటమునిగినట్లు అంచనా. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రైతులను ధైర్యం చెబుతూ, పంట నష్టాల వివరాలను పై అధికారులకు నివేదించి సహాయ చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.