కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి ఇన్స్యూరెన్స్ చెక్కు అందజేతపోలీసు కుటుంబాలకు ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీ భరోసా — జిల్లా ఎస్పీ నరసింహ
డైనమిక్,సూర్యాపేట బ్యూరో, నవంబర్ 6 రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక బాసటగా రూ.1 కోటి ఇన్స్యూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ నరసింహ గురువారం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు అందజేత కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన కానిస్టేబుల్ రాంబాబు కుటుంబ సభ్యులకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పోలీస్ సాలరీ ప్యాకేజీ కింద ఈ ఇన్స్యూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. పోలీసు కుటుంబాలకు ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజీతో భరోసా ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, “పోలీసు సిబ్బంది కోసం ఎస్‌బీఐ రూపొందించిన...