వరంగల్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణం శరవేగంగా! భద్రకాళి ఆలయం సమీపంలో రూ.20 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల భవనం – 600 కార్ల పార్కింగ్ సదుపాయం

డైనమిక్,వరంగల్, నవంబర్ 06 వరంగల్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారంగా మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భద్రకాళి ఆలయం ఎదురుగా ఉన్న 3 ఎకరాల భూమిలో రూ.20 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కూడిన 5 అంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించనున్నారు. 600 కార్లకు స్థానం ఈ పార్కింగ్ కాంప్లెక్స్‌లో ఒకేసారి సుమారు 600 కార్లు నిలిపే సౌకర్యం కల్పించనున్నారు. వరంగల్ నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉండటంతో, ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర రవాణా వ్యవస్థకు బాగా ఊరట కలగనుంది. హైదరాబాద్ నమూనాలో ప్రాజెక్టు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఇప్పటికే ఇలాంటి...