జూబ్లీహిల్స్ నియోజకవర్గం — ఉపఎన్నికల సందడి బోరబండలో బీఆర్ఎస్ ముమ్మర ప్రచారం
మాగంటి సునీత-గోపినాథ్ విజయం కోసం శ్రేణుల కసరత్తు హైదరాబాద్, నవంబర్ 5, డైనమిక్ డెస్క్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత-గోపినాథ్ విజయానికి పార్టీ శ్రేణులు కృషి ముమ్మరం చేశాయి. బోరబండ డివిజన్‌లోని 342, 343 బూత్‌ల పరిధిలో ఈ రోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కోటిరెడ్డి నేతృత్వంలో ప్రచార జోరు ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు (MLC) యం.సి. కోటిరెడ్డి పాల్గొని ఓటర్లను కలుసుకున్నారు. ఆయనతో పాటు గోపినాథ్ కుమార్తెలు, స్థానిక బూత్ ఇన్‌చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల మనోభావాలు బీఆర్ఎస్ పక్షాన: కోటిరెడ్డి “రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ప్రజల మదిలో...