కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు – హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు, ఎస్ ఐ రవీందర్ దర్శనం
డైనమిక్, నేరేడుచర్ల,నవంబర్ 5 కార్తీక పౌర్ణమి పుణ్యకాలంలో నేరేడుచర్ల శివాలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుండే మహిళా భక్తులు శివాలయాలకు తరలివచ్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర ఆలయంలో భక్తుల సందడి నేరేడుచర్ల మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ సోమప్ప సోమేశ్వరాలయం, అలాగే పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయంలో బుదవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు, నేరేడుచర్ల సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ లు కుటుంబ సమేతంగా శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ చిత్తనూరు సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు....