సిపిఐ నూరు ఏళ్ల వేడుకలను పండుగలా జరుపుకుందాం : జిల్లా కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు

డైనమిక్,గరిడేపల్లి, నవంబర్ 5 భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) స్థాపనకు డిసెంబర్ 26 నాటికి నూరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ వేడుకలను గ్రామ గ్రామాన పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రతి పోరాటంలో సిపిఐ పాత్ర విశిష్టం గరిడేపల్లి మండల కేంద్రంలో బుదవారం సిపిఐ సీనియర్ నాయకుడు త్రిపురం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరానికి ముందు, తర్వాత జరిగిన ప్రతి ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు.దేశంలో దొరలు, దేశముఖులు, జమీందారుల దమనానికి వ్యతిరేకంగా పేద ప్రజలను...