శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ఎపి, తెలంగాణా, డైనమిక్ డెస్క్ తెలుగు రాష్ట్రాలు బుదవారం కార్తీక పౌర్ణమి ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో మారుమోగుతున్నాయి. శివాలయాలు నిండా భక్తుల సందోహం, పూజా కార్యక్రమాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ప్రాంతంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలే ఆచారం విశేషంగా కనిపించింది. శ్రీశైలంలో భక్తుల రద్దీతో కిటకిట కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు చేసి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం దీర్ఘ క్యూలైన్లలో నిలుస్తున్నారు. సాధారణ దర్శనానికి నాలుగు గంటలు,...