విద్యార్థులు సృజనాత్మకతతో పాటు వృత్తి నైపుణ్యం సాధించాలి — కలెక్టర్ ఇలా త్రిపాఠి సెట్విన్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వృత్తి శిక్షణా కార్యక్రమాలు

డైనమిక్,నల్గొండ బ్యూరో, నవంబర్ 4 విద్యార్థులు అకాడమిక్‌ విద్యతో పాటు వృత్తి విద్య, సృజనాత్మకతను అలవర్చుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.మంగళవారం నల్గొండ పట్టణం సమీపంలోని రాంనగర్‌లో గల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. "వృత్తి విద్యా శిక్షణ విద్యార్థులకు భవిష్యత్తు బాట చూపిస్తుంది" మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ పొందడం అత్యవసరమని ఆమె తెలిపారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీల వల్ల జరుగుతున్న మార్పులకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు.భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి వృత్తి విద్యా...