హుజూర్నగర్ కోర్టులో భారత్ మహిళల వన్డే విజయం ఘనంగా సంబరాలు 40 ఏళ్ల కల సాకారం… న్యాయవాదుల స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సవం

డైనమిక్ ,హుజూర్నగర్ నవంబర్‌ 3 భారత్ మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ గర్వకారణ ఘన విజయాన్ని పురస్కరించుకొని హుజూర్నగర్ కోర్టులో న్యాయవాదులు సోమవారం విజయోత్సవం నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలో ఉత్సాహపూరిత వాతావరణం మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో కోర్టు ప్రాంగణం ఆనందభరితంగా మారింది. న్యాయవాదులు పరస్పరం స్వీట్లు పంచుకుంటూ, “ఇది భారత మహిళా క్రీడా చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోతుంది” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. న్యాయవాదుల సమిష్టి భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్ కార్యదర్శి చనగాని యాదగిరి, లైబ్రరీ కార్యదర్శి లాయర్ విశ్వనాథ్, న్యాయవాదులు వీరు, వెంకటేష్, శ్రీను,...