పల్నాడు గురుకులంలో దారుణం! ఐదు రోజులుగా విద్యుత్, నీరు లేక విద్యార్థినుల అవస్థలుయాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం – తల్లిదండ్రుల ఫోన్ కాల్స్‌లో విలపిస్తున్న బాలికలు

డైనమిక్, వినుకొండ,నవంబర్2 పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం, ఉప్పలపాడు గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో (APREIS) విద్యార్థినులు గత ఐదు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్‌ ప్రాంగణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు తాగునీటి సమస్య కూడా నెలకొనడంతో విద్యార్థినులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నాయి. పారిశుధ్య సమస్యలు తీవ్రం నీటి లేమి కారణంగా విద్యార్థినులు తాగునీరు, స్నానం, శౌచాలయ వినియోగం వంటి మౌలిక అవసరాల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని సమాచారం. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సిబ్బంది చేతులెత్తేసిన పరిస్థితి తల్లిదండ్రులు మరియు విద్యార్థినులు పాఠశాల సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ, వారు “మేము ఏమీ...