కోటప్పకొండలో పద్మశాలీయ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవం ఘనంగా ప్రధాన అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

డైనమిక్, నరసరావుపేట,నవంబర్2 నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో పద్మశాలీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వన సమారాధన కార్యక్రమం ఆధ్యాత్మికత, సాంస్కృతికత నిండిన వాతావరణంలో సాగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సమాజంలో ఐక్యత, సేవాభావం, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యంపై పలు అంశాలను ప్రస్తావించారు. కార్తీక మాసానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం "కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. వన సమారాధన భక్తులకు మానసిక శాంతి, ఆరోగ్యం, సమృద్ధి ప్రసాదిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది" అని ఎమ్మెల్యే అన్నారు. పద్మశాలీల సంక్షేమం...