మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసుకు హత్తుకునే ఉదారత కిడ్నీ మార్పిడి చికిత్సకు స్వంతంగా ₹12.5 లక్షల సహాయం – యువకుడికి కొత్త జీవం
డైనమిక్ ,మునుగోడు, నవంబర్ 2 మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కిడ్నీ సమస్యతో జీవితమంతా చీకటిలో మునిగిపోయిన పేద కుటుంబానికి ఆశాకిరణంగా మారి యువకుడికి కొత్త ప్రాణం పోశారు.నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నెల్లి గణేష్ (26) కిడ్నీలు పనిచేయకపోవడంతో గత కొద్ది నెలలుగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డాక్టర్లు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స (Kidney Transplantation) తప్ప గణేష్ ప్రాణాలు నిలవవని తేల్చారు. అయితే కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో చికిత్సకు కావాల్సిన భారీ వ్యయం భరించలేక తీవ్ర ఆందోళనలో వున్నారు.ఈ విషయం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి రావడంతో...