జనగణనకు నల్గొండ సిద్ధం – తిప్పర్తి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కలెక్టర్ ఇలా త్రిపాఠి శిక్షణా శిబిరానికి శ్రీకారం

నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్2 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న ముందస్తు గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు.ఆదివారం తిప్పర్తి రైతు వేదికలో ప్రారంభమైన మూడు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. ఈ శిబిరంలో పాల్గొంటున్న 35 మంది ఎన్యుమరేటర్లు, 6 మంది సూపర్వైజర్లు గణన విధానాలపై అవగాహన పొందుతున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఎంపిక 2027 జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది.పట్టణ ప్రాంతం: జిహెచ్ఎంసి పరిధి గ్రామీణ ప్రాంతం: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గిరిజన ప్రాంతం: భద్రాద్రి...