సిపిఐ వందవ వార్షికోత్సవాల జాత – నేరేడుచర్లలో ప్రారంభం జిల్లాలోనే తొలి కరపత్రం ఆవిష్కరణ – పార్టీ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఖమ్మం సభ విజయవంతం చేయాలని పిలుపు
డైనమిక్ , నేరేడు చర్ల,నవంబర్ 2 సిపిఐ పార్టీ వందవ వార్షికోత్సవాల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచార జాత సూర్యాపేట జిల్లాలో ఈనెల 20న నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జిల్లాలో తొలి కరపత్రాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.ఆదివారం నాడు నేరేడుచర్లలోని సిపిఐ కార్యాలయం ‘ప్రజా భవన్’లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర గల ఏకైక పార్టీ సిపిఐ అని తెలిపారు. “1925 డిసెంబర్ 26న ఏర్పడిన తొలి కమ్యూనిస్టు సెల్ నుంచి నేటివరకు సిపిఐ ప్రజా ఉద్యమాలకు ముందుండి నాయకత్వం వహిస్తోంది. కార్మిక,...