ఇస్రో మరో సంచలనం బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం – CMS–03 ఉపగ్రహంతో కొత్త మైలురాయి దిశగా భారత్

డైనమిక్ డెస్క్,శ్రీహరికోట, నవంబర్ 2 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమైంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 ఎం5 (LVM3–M5) ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా సీఎంఎస్–03 (CMS–03) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సాయంత్రం 5:26కు బాహుబలి రాకెట్ టేకాఫ్‌ తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)**లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఆదివారం సాయంత్రం 5 గంటల 26 నిమిషాలకు ఎల్వీఎం–3 ఎం5 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.శాస్త్రవేత్తలు ఇప్పటికే రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసి, 24 గంటల...