జూదంపై టాస్క్ ఫోర్స్ దాడి – ఆరుగురు అరెస్టు వీరోజిపల్లి గ్రామ పరిసరాల్లో అక్రమ జూదం
మెదక్ జిల్లా, డైనమిక్,నవంబర్2 పెద్ద శంకరంపేట మండల పరిధిలోని వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం రాత్రి అక్రమ జూదం జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టాడీ షాప్ సమీప ప్రాంతంలో ఆకస్మిక దాడి చేపట్టారు. ఆరుగురి అరెస్ట్ – రూ.17,709 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం దాడి సందర్భంగా బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.17,709 నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిని మరియు స్వాధీనం చేసిన వస్తువులను శంకరంపేట పోలీస్ స్టేషన్‌కు...