పేదల సేవలో సీఎం చంద్రబాబు కదిరి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ – కాశీబుగ్గ ఘటనపై సంతాపం
డైనమిక్ డెస్క్,శసత్యసాయి జిల్లా, నవంబర్ 1 ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దన్నవారిపల్లె గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో మేళవించి, పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. వితంతు, వృద్ధాప్య పింఛన్లు స్వయంగా అందజేత కార్యక్రమంలో సీఎం మేడా రెడ్యమ్మకు వితంతు పింఛన్, మేడా మల్లయ్యకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందజేశారు.పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, “సీఎం చేతుల మీదుగా పింఛన్ అందుకోవడం తమ అదృష్టం” అన్నారు. ప్రజల వినతులు స్వీకరించిన సీఎం గ్రామ సందర్శన సందర్భంగా సీఎం చంద్రబాబు గ్రామస్తుల నుంచి పలు వినతులు స్వీకరించారు. తరువాత జరిగిన ప్రజావేదిక సభలో పాల్గొని,...