దేవాలయ భూముల రక్షణకు రేవంత్ సర్కారు కొత్త చట్టం

డైనమిక్ డెస్క్ హైదరాబాద్, నవంబర్ 1 తెలంగాణలో దేవాలయ భూముల సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ భూములపై జరుగుతున్న ఆక్రమణలను అరికట్టేందుకు సర్కారు కొత్త బిల్లు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్, 1987లోని చాప్టర్ XIలో మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో సెక్షన్లు 83, 84లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. కబ్జాకోరులకు చెక్ ట్రిబ్యునల్, కోర్టు కేసుల పేరుతో వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వందల ఎకరాలు కబ్జా అయ్యాయని ప్రభుత్వ అంచనా. ఈ పరిస్థితికి చెక్...