రోడ్డు ప్రమాద స్థలాలు పరిశీలించి రోడ్డు భద్రత చర్యలపై కఠిన సూచనలు – ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష జిల్లా ఎస్పీ నరసింహా

డైనమిక్,సూర్యాపేటబ్యూరో, నవంబర్ 1 రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీసు అధికారి నరసింహ ఐపీఎస్ ఈరోజు రూరల్ పరిధిలోని పలు రోడ్డు ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించారు. ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారి 65పై పరిశీలన జాతీయ రహదారి 65పై టేకుమట్ల, రాయిని గూడెం, పిల్లలమర్రి జంక్షన్, జనగామ ఎక్స్‌రోడ్, అంజనాపూరి కాలనీ జంక్షన్, కొత్తమార్కెట్ రోడ్డు జంక్షన్, ఎఫ్‌సిఐ గోదాం వద్ద ప్రమాద స్థలాలను ఎస్పీ పరిశీలించారు.రోడ్డు అథారిటీ అధికారులతో కలిసి ఇంజనీరింగ్ లోపాలను సవరించి, ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు, లైటింగ్,...