రైతుని పలకరించి ధాన్యం రాశిపోసిన జిల్లా ఎస్పీ నరసింహ రైతు జీవన అనుభవాన్ని గుర్తుచేసుకున్న పోలీసు అధికారి

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, నవంబర్ 1 సూర్యాపేట జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదకర ప్రాంతాలు, రోడ్డు భద్రతా చర్యలను పరిశీలించడానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారి నరసింహ రైతులను పలకరించి వారితో ముచ్చటించారు. రైతులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎస్పీ రైతులు ధాన్యం ఆరబెడుతున్నప్పుడు అక్కడికి చేరుకున్న నరసింహ వారిని పలకరించి, ఆత్మీయంగా మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకుని స్వయంగా ధాన్యాన్ని రాశిపోసి సహకారం అందించారు. ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినని, వ్యవసాయంపై ఎప్పటినుంచో మమకారం కలిగి ఉన్నానని తెలిపారు. రైతులకు పలు సూచనలు వ్యవసాయంలో మంచి రకమైన విత్తనాలను ఉపయోగించి నాణ్యమైన దిగుబడి సాధించాలని,...