ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా చేపట్టాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, నవంబర్ 1 రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సూచించారు.నివారం ఆయన హైదరాబాద్‌ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2025 పురోగతిని సమీక్షించారు. ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించామని తెలిపారు.కేటగిరీ A – 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఓటరు జాబితాల్లో...