శిశు విక్రయాలు, బాల్యవివాహాలపై కఠిన చర్యలు – కలెక్టర్ ఇలా త్రిపాఠి
జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 1 ఆడబిడ్డలను రక్షించడంలో భాగంగా జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.శనివారం నాడు కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖాధికారులు, ఆర్సీసీ ఓలతో సమీక్ష నిర్వహించిన ఆమె, ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న శిశు విక్రయాలు, బాల్యవివాహాలు, లైంగిక దాడులు వంటి సంఘటనల నేపథ్యంలో అధికారులపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “శిశు విక్రయం సిగ్గుచేటు” అభివృద్ధి చెందిన సమాజంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు విషయమని కలెక్టర్ వ్యాఖ్యానించారు. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరగకుండా ప్రతి శాఖ...