సిఐటియు నల్గొండ జిల్లా 13వ మహాసభలు ఈనెల 29 30 తేదీలలో జరుగు సభను విజయవంతం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం

డైనమిక్ న్యూస్ ప్రతినిధి నల్గొండ జిల్లా నవంబర్ 01 నల్గొండ పట్టణలో శనివారం విస్తృతస్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్ లోజరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ, కార్మికుల పోరాటాల సారధి సిఐటియు నల్లగొండ జిల్లా 13 వ మహాసభలు పోరాటాల పురిటీగడ్డ నల్లగొండపట్టణంలో 2025 నవంబర్ 29,30 తేదీలలో జరుగుతున్నాయని సీ ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం  తెలిపారు.ఈ మహాసభలలో జిల్లాలోని 33 మండలాల నుండి జిల్లావ్యాపితంగా వివిధ యూనియన్స్ నుండి 500 మంది ప్రతినిధులు, అఖిల భారత మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు.ఐక్యత పోరాటం నినాదంతో 1970 లో సిఐటియు ఏర్పడినప్పటి నుండి దేశంలో కార్మికవర్గ హక్కుల కోసం...