తడిసిన ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతోంది – కలెక్టర్ ఇలా త్రిపాఠి
డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 1 మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలోని పది మండలాల పరిధిలో తడిసిన వరి ధాన్యం యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు.ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు గుర్తించామని ఆమె వెల్లడించారు. రైతులు స్వయంగా ఆ ధాన్యాన్ని కొంతమేరకు ఆరబెట్టినప్పటికీ, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు 2,653 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని వివరించారు.రైతులు విక్రయించిన ధాన్య వివరాలను ట్యాబ్ ఎంట్రీల ద్వారా నమోదు చేసి, వారికి రావలసిన...