మెదక్ జిల్లాలో 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం –పాపన్నపేట పోలీసుల విశేష కృషి: జిల్లా అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ జిల్లా స్టాఫర్, డైనమిక్,నవంబర్1 మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల్లంతైన 30 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అదనపు పోలీసు అధికారి మహేందర్, పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్‌లు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారని తెలిపారు. సాంకేతిక పద్ధతుల వినియోగంతో గుర్తింపు బాధితులు ఇచ్చిన ఫోన్‌ల గుర్తింపు నంబర్లను సేకరించి, ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి వాటి స్థానాలను గుర్తించ గలిగారు. ఈ ప్రక్రియలో మొత్తం 30 మొబైల్ ఫోన్‌లను వివిధ ప్రాంతాల్లో కనుగొని...