393 అంబాసిడర్‌తో అనుబంధాన్ని స్మరించిన సీఎం చంద్రబాబు

డైనమిక్ డెస్క్,అమరావతి, నవంబర్ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవన ప్రయాణంలో ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న 393 అంబాసిడర్ కారుతో మళ్లీ జ్ఞాపకాలను తడుముకున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఆయన ఉపయోగించిన ఈ అంబాసిడర్ కారు తన వ్యక్తిగత వాహనం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ కారు ఆయన కాన్వాయిలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. “393 అంబాసిడర్ అంటేనే చంద్రబాబు” అని రాజకీయ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపును పొందిన ఈ వాహనాన్ని సీఎం ఎంతో మమకారంగా చూసుకుంటారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భద్రతా పరమైన ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నప్పటికీ, ఆ నాటి 393...