భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీ – ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల– 31 అక్టోబర్ నుంచి దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రారంభం అయినాయి

డిల్లి, డైనమిక్ డెస్క్,నవంబర్ 1 భారత ప్రభుత్వంలోని ప్రముఖ సంస్థ భారతీయ రైల్వే (Indian Railways) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తుల తేదీలు దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 31 నుంచి ప్రారంభమైనాయి. అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తుల చివరి తేదీ 2025 నవంబర్ 30గా నిర్ణయించారు. ఫారమ్‌లో ఏదైనా తప్పు జరిగితే, డిసెంబర్ 3 నుంచి 12 వరకు...