పెద్దవూర పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యటన

నల్లగొండ బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 31 మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది విధి నిర్వహణ, స్టేషన్ పరిమితిలోని శాంతిభద్రతల పరిస్థితులు, భౌగోళిక పరిసరాలపై ఎస్పీ సవివరంగా ఆరా తీశారు. రికార్డుల పరిశీలన – సిబ్బందికి మార్గదర్శకాలు ఎస్పీ స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ రూమ్, లాక్‌అప్, యస్‌హెచ్‌ఓ గది వంటి విభాగాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డులు, కేసు దర్యాప్తు వివరాలను పరిశీలిస్తూ, “ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడడం ప్రతి...