తుఫాను ప్రభావం పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డీ

డైనమిక్, నేరేడు చర్ల, అక్టోబర్ 31 సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి షేక్ జావేద్‌ శుక్రవారం నాడు నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పంటల నష్ట స్థాయిని అంచనా వేసి, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. పంట నష్టం తగ్గించేందుకు సూచనలు అధికారులు రైతులకు తగు సూచనలు అందజేశారు. పాలు పోసుకునే దశలో చేలు పడిపోతే ముందుగా అంతర్గత కాలువల ద్వారా నీటిని తొలగించాలని, తరువాత పడిపోయిన చేలను పైకి లేపి కట్టుకోవాలని సూచించారు. తెగుళ్ల నివారణ చర్యలు నిలిచిన మరియు పడిపోయిన చేలలో గింజల...