ఐక్యతా మూలస్తంభం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిభారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి
డైనమిక్ డెస్క్ , హైదారాబాద్,అక్టోబర్ 31 భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు దేశ ఐక్యత, దృఢ సంకల్పం, అచంచల నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నాడియాద్ గ్రామంలో జన్మించిన పటేల్, న్యాయవృత్తిని చేపట్టినా, స్వాతంత్య్ర పోరాటాన్ని తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు. మహాత్మా గాంధీ ఆలోచనల ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంబేద్కర్‌కు పటేల్ అపార మద్దతు భారత రాజ్యాంగ రచనలో సర్దార్ పటేల్ పాత్ర అత్యంత కీలకమైనది. రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా అంబేద్కర్‌ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన,...