ముంతా తుఫాన్ ముంచేసిన రైతులు – పంటల నష్టం పట్ల ఆవేదన బోత్తలపాలెం, అలింగాపురం, గుండ్లపాడు గ్రామాల్లో సిపిఎం పరిశీలన

డైనమిక్, పాలకవిడు అక్టోబర్ 31 మోన్తా తుఫాన్ కారణంగా పాలకవీడు మండలం పరిధిలో బోత్తలపాలెం, అలింగాపురం, గుండ్లపాడు గ్రామాల పరిధిలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టాన్ని సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ నాయకులతో కలిసి శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అవసరం తుఫాన్ ప్రభావంతో వరిధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగి పూర్తిగా నాశనం కావడం రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అనంత ప్రకాష్ తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆయన వాపోయారు. ఎకరాకు ₹30,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ రైతులు...