తడిసిన ధాన్యాన్ని వెంటనే నివేదిక ఇవ్వాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్,అక్టోబర్ 30 జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో ఆయన సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. కొనుగోలు కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ మోంధా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ, ముందస్తు అప్రమత్తతతో ధాన్యపు రాశులపై టార్పాలిన్ కప్పడం వల్ల పెద్ద నష్టం జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు.ఎక్కడైనా అడుగు భాగంలో లేదా అంచుల్లో ధాన్యం తడిస్తే వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి...