మూసి నదిపై భీమారం వంతెన వద్ద నీటి ప్రవాహం పరిశీలన ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 30 సూర్యాపేట రూరల్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేదేరివారి గూడెం సమీపంలోని భీమారం లో–లెవల్ వంతెన వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా పోలీసు అధికారి నరసింహ గురువారం స్వయంగా పరిశీలించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, నదులు నిండిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రజలు నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా, చెరువులు, కుంటలు, వాగులు, నదుల్లోకి దిగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసు శాఖ అప్రమత్తంగా భద్రతా చర్యలు...