పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి సైకిల్ ర్యాలీతో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 30 పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలో గురువారం సైకిల్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.పట్టణంలోని యన్‌.జి కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రామగిరి మీదుగా క్లాక్‌టవర్ వరకు కొనసాగింది. పోలీసు సిబ్బంది, విద్యార్థులు, పట్టణ యువకులు ఉత్సాహంగా పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించారు. శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుందాం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, “దేశం కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయాలు. వారి త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం...