డీజిల్ దొంగల బృందం పట్టుబాటు శంకరంపేట పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు యువకులు – పరారీలో ప్రధాన నిందితుడు అన్వర్
డైనమిక్ న్యూస్, మెదక్ జిల్లా ,అక్టోబర్ 30 చీలపల్లి బ్రిడ్జి వద్ద తనిఖీల్లో బలెనో కారు పట్టింపు పెద్ద శంకరంపేట పోలీసులు డీజిల్ దొంగల బృందాన్ని అరెస్ట్ చేసినట్లు గురువారం సీఐ రేణుకా రెడ్డీ, ఎస్ ఐ ప్రవీణ్ రెడ్డి లు ఎర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో తెలిపారు .బుదవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఎస్సై సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చీలపల్లి బ్రిడ్జి వద్ద TS08FF 3047 నంబర్ గల బలెనో కారును ఆపి తనిఖీ చేశారు.కారులో 30 లీటర్ల సామర్థ్యం గల ఆరు ఖాళీ డబ్బాలు లభించాయి. పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ముగ్గురు యువకులను కారుతో సహా స్టేషన్‌కు తరలించి విచారించారు....