“మోంధా” తుఫాన్ ప్రభావం — సూర్యాపేట జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ విజ్ఞప్తి

సూర్యాపేట బ్యూరో,డైనమిక్, అక్టోబర్ 29 సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా “మోంధా” తుఫాన్ తీవ్ర ప్రభావం కొనసాగుతోంది.వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట పోలీస్ శాఖ “రెడ్ అలర్ట్” ప్రకటించింది. పోలీస్ శాఖ అత్యంత అప్రమత్తం జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు — “పోలీసు శాఖ మొత్తం అప్రమత్తంగా ఉంది. అన్ని సెలవులు రద్దు చేసి సిబ్బందిని విధుల్లోకి పిలిపించాం. ప్రమాదకర ప్రాంతాలు, వంతెనలు, కల్వర్టుల వద్ద పికెట్లు ఏర్పాటు చేశాం” అని చెప్పారు. జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీరు ప్రవహిస్తున్న...