కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వరదనీరు పెరగడంతో కలకలం సమయస్ఫూర్తితో స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ — విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలింపు
నల్లగొండ బ్యూరో ,అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్): మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాలో ఆందోళన వాతావరణం సృష్టించాయి. అనేక గ్రామాలు, తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ సందర్భంలో దేవరకొండ మండలంలోని కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో నీరు ఊచకోతలా వచ్చి చేరడంతో విద్యార్థులు ఒక దశలో ప్రమాదంలో చిక్కుకున్నారు. ఎస్పీ స్వయంగా పర్యవేక్షణ – సమయానికి రక్షణ చర్యలు సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వేగంగా స్పందించి, పోలీసు సిబ్బందితో కలిసి పాఠశాల పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులందరినీ తక్షణమే...