చిరు వ్యాపారులపై కూలిన చింతచెట్టు – రోడ్డునపడ్డ మూడు కుటుంబాలు తక్షణ సాయం అందజేసిన రాష్ట్ర టిడిపి నాయకుడు పంగులూరి అంజయ్య
డైనమిక్, కారం పూడి,అక్టోబర్29 తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని ఎన్‌టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద బుదవారం తెల్లవారుజామున పెద్ద చింతచెట్టు కూలి, చిరు వ్యాపారుల సముదాయాలపై పడింది.ఈ ప్రమాదంలో ఒక ఇల్లు, రెండు షెడ్లు కూలిపోవడంతో మూడు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించేలా చర్యలు ఈ ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర టిడిపి నాయకుడు పంగులూరి అంజయ్య, పట్టణ మాజీ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ, సీనియర్ నాయకుడు మస్తాన్ జానీ, మహిళా నాయకురాలు కాటంరెడ్డి నాగలక్ష్మి రెడ్డి, సర్పంచి సరస్వతి భాయ్ బాలునాయక్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పంగులూరి అంజయ్య మాట్లాడుతూ...