సూర్యాపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, ప్రజలకు సూచనలు
డైనమిక్ ,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 29 మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలి జిల్లాలో వర్ష పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అధికారులు తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ విభాగం అధికారి కూడా అనుమతి లేకుండా ప్రధాన కేంద్రం వదిలి వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు — 6281492368 వర్ష పరిస్థితులను...