మొంథా తుఫాన్ ప్రభావం – నల్గొండ జిల్లా అధికారులు హై అలర్ట్‌లో వుండి జిల్లా కేంద్రం నుండి గ్రామాల వరకూ అధికారులు కార్యస్థలాల్లో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు
నల్గొండ బ్యూరో, అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్) మొంథా తుఫాన్ కారణంగా నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా కేంద్రం నుండి గ్రామస్థాయివరకు సిబ్బంది తమ తమ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణ సహాయం అందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సూచనలు బుధవారం జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ — “ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లనుండి బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. రైతులు...