తుఫానునేపథ్యంలోఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను అప్రమత్తంగా ఉండాలి:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనలు
హైదరాబాద్, అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్) మొంథా” తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో హై అలర్ట్‌గా ఉండాలి బుధవారం మంత్రి ఆర్‌అండ్‌బీ శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో ఫోన్‌లో మాట్లాడారు.అధికారులంతా ఫీల్డ్ స్థాయిలో హై అలర్ట్‌గా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ సెలవులకు వెళ్లరాదని స్పష్టం చేశారు. మాన్సూన్ సమయంలో చూపిన కృషి ప్రశంసనీయం మాన్సూన్ సీజన్‌లో ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో తీసుకున్న జాగ్రత్త చర్యలు ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో ఈ...