తుఫాన్ మధ్య మానవత్వం — రెండు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
నెల్లికుదురు, అక్టోబర్ 29 (డైనమిక్ న్యూస్) మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య కూడా సేవలో నిబద్ధత చూపిన 108 అంబులెన్స్ సిబ్బంది వీరోచిత చర్యతో రెండు ప్రాణాలను కాపాడారు. విరిగిన చెట్టు రోడ్డుకు అడ్డం నెల్లికుదురు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై తుఫాన్ ప్రభావంతో చెట్టు విరిగి రోడ్డుపై పడింది. రవాణా పూర్తిగా స్తంభించింది. ఇదే సమయంలో వావిలాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శ్వాసలో ఇబ్బంది పడగా, 108 అంబులెన్స్‌కు సమాచారం అందింది. మరోవైపు రావిరాల గ్రామంలో ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో మరో అంబులెన్స్‌ను పిలిచారు. స్వయంగా చెట్టు నరికి దారి తీశారు వర్షం, గాలి తాకిడిని లెక్కచేయకుండా నెల్లికుదురు,...