“మొంథా” తుఫాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి:హాలీయ ఎస్‌ఐ సాయి ప్రశాంత్

డైనమిక్ న్యూస్ ప్రతినిధి, నల్గొండ — అక్టోబర్ 29 హాలీయ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సాయి ప్రశాంత్ మండల ప్రజలకు బుదవారం విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం “మొంథా” తుఫాన్ ప్రభావంతో మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, చెరువులు, వాగులు నిండుకుండాలా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దు “ఇప్పటికే చాలా చెరువులు మత్తడి పొసే పరిస్థితిలో ఉన్నాయి. వాగులు పొంగే అవకాశం ఉంది. ఎవ్వరూ వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయకండి,” అని ఎస్‌ఐ సాయి ప్రశాంత్ సూచించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో గుంతలు, మట్టి ప్రాంతాలను గమనించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు....