తెలంగాణలో అక్టోబర్ 30న కాలేజీల బంద్‌ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలపై ఎస్ ఎఫ్ ఐ ఆందోళన
డైనమిక్ డెస్క్,హైదరాబాద్, అక్టోబర్ 29 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు రేపు — అక్టోబర్ 30వ తేదీన — సెలవు రానుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 8 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని SFI నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. బకాయిలను నవంబర్ మొదటి వారంలోగా విడుదల చేయకపోతే ‘ఛలో హైదరాబాద్’ పేరుతో భారీ...