సినీ కార్మికుల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “హాలీవుడ్‌కి పోటీగా హైదరాబాద్‌ను ప్రపంచ సినీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం”
డైనమిక్ ,హైదరాబాద్, అక్టోబర్ 28 తెలుగు సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఘనంగా పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “హైదరాబాద్‌కి సినీ పరిశ్రమ రాకకు మర్రి చెన్నారెడ్డి కారణం” తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నది ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.ఆయన అన్న ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహానటులను స్వయంగా కలసి ప్రోత్సహించారు. వారి సహకారంతోనే తెలుగు సినిమాకు హైదరాబాద్ చిరస్థాయిగా నిలిచింది,” అని పేర్కొన్నారు. “ప్రభాకర్ రెడ్డి కృషి మరువలేం”...