అప్రమత్తంగా ఉండండి.. అధైర్యపడకండి – ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
డైనమిక్, మాచర్ల, అక్టోబర్ 28 మొంథా తుపాను ప్రభావంపై కూటమి ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడవద్దని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు సంయుక్తంగా ఇచ్చిన నివేదికల ఆధారంగా తుపాను వల్ల సంభవించే నష్టాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసిందని చెప్పారు.రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రోజువారీగా పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్లు జారీ చేసిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార...